శని ప్రదోష వ్రతం రోజున శివుడిని పూజించాలని, అభిషేకం చేయాలని శాస్త్రాలలో చెప్పబడింది. దీనితో పాటు, ఈ రోజున శని దేవుడికి ఆవనూనెతో దీపం వెలిగించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి.
అలాగే శివునికి ఇష్టమైన బియ్యంతో చేసిన అన్నం, పాయసంతో శివ మంత్రాలు పఠిస్తూ ఉపవాసం ఉంటే కోటీపుణ్యం లభిస్తుందని చెబుతారు. ఆహారం లేకుండా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు మాత్రమే తినాలని సూచించారు.