చంద్రగ్రహ దోషాలను దూరం చేసుకోవాలంటే?

గురువారం, 11 డిశెంబరు 2014 (14:51 IST)
నవగ్రహాలను ఇష్టమైన పూలతో పూజిస్తే వారి అనుగ్రహంతో కష్టాలను తగ్గించుకోవచ్చునని పంచాంగ నిపుణులు అంటున్నారు. నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో వర్ణంలో గల పూలు ప్రీతికరమైనవిగా పేర్కొనబడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రగ్రహానికి 'తెల్లని వర్ణం'లో గల పూలు ప్రీతికరమైనవి.
 
చంద్రగ్రహ సంబంధమైన దోషాలతో ఇబ్బందులు పడుతున్నవాళ్లు, ఆయనని తెల్లని వర్ణంలో గల పూలతో పూజించడం మంచిది. ఈ విధంగా చేయడం వలన చంద్రుడు సంతోషపడిపోతాడు ... సంతృప్తి చెందుతాడు. ఫలితంగా చంద్రగ్రహ సంబంధమైన దోషాలతో బాధలుపడుతున్నవాళ్లని కరుణిస్తాడు. తద్వారా ఈతిబాధలు ఉండవని, సుఖసంతోషాలుంటాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి