దత్తాత్రేయను ఏ పూలతో పూజించాలో తెలుసా?

శుక్రవారం, 5 డిశెంబరు 2014 (17:11 IST)
అత్రిమహర్షి-అనసూయా దేవి దంపతులకు త్రిమూర్తుల అంశంతో జన్మించిన దత్తాత్రేయుడు భక్తులపాలిట కామధేనువు, కల్పవృక్షమై కరుణిస్తాడు. దత్తాత్రేయుడు ఎవరికైనా సాయపడాలని అనుకున్నప్పుడు వాళ్లను తప్పనిసరిగా పరీక్షిస్తాడు. 
 
ఇందుకోసం స్వామి అనేక రూపాల్లో తిరుగుతూ ఉంటాడు. ఆయన మాయను తెలుసుకోవడం అసాధ్యమనడానికి అనేక సంఘటనలు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి.
 
దత్తాత్రేయస్వామిని పూజించడం వలన కష్టాలు కనిపించకుండాపోతాయి. సిరిసంపదలు నిత్యనివాసం చేస్తాయి. ఆయన నామస్మరణమే ఒక ఔషధంలా పనిచేస్తుంది. అనారోగ్యాలను తొలగించి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది.
 
గురువారం లేదా 'దత్త జయంతి' రోజున స్వామిని 'పసుపురంగు పూలతో పూజ చేస్తే అనుకున్నది సిద్ధిస్తుంది. పసుపురంగు పూలతో పూజించడం వలన సత్వరమే ఆయన అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి