కార్తీక మాసంలో హరిహరులను పూజించండి!

శనివారం, 25 అక్టోబరు 2014 (14:33 IST)
కార్తీక మాసాన్ని కౌముది మాసమని, దామోదర మాసం అని కూడా పిలుస్తుంటారు. కార్తీక మాసం, శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పే కార్తీక మాసంలో హరిహరుల అనుగ్రహాన్ని పొందాలంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కార్తీక దామోదరుడి నామాన్ని స్మరిస్తూ నదీ స్నానం చేయవలసి వుంటుంది. 
 
ఈ మాసంలో అన్ని జలాశయాల్లోనూ 'గంగ' అంతర్లీనంగా ప్రవహిస్తూ వుంటుంది కనుక, స్నాన ఫలితం విశేషంగా వుంటుంది. ఈ మాసంలో చేసే దైవారాధన, ఉపవాసాలు, జపాలు, దీప దానాలు అనంతమైన పుణ్యఫలాలను అందిస్తాయి. 
 
అత్యంత భక్తి శ్రద్ధలతో హరిహరులను పూజించడం, కీర్తించడం, పురాణ పఠనం చేయడం, ఆలయాలలో దీపారాధన చేయడం, వనభోజనాలకు వెళ్లడమనేది కార్తీకమాసంలో ఆచరించవలసిన ప్రధానమైన విధులుగా చెప్పబడుతున్నాయి. ఈ విధులను ఆచరించడం వలన లభించే పుణ్యఫలం వెంటే వుంటుందని పురాణాలు చెబుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి