శివుడిని గన్నేరులతో పూజిస్తే ఫలితం ఏమిటి?

శనివారం, 29 నవంబరు 2014 (19:30 IST)
కార్తీక మాసమే కాదు.. అనునిత్యం ముక్కంటిని పూజించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. సాధారణంగా స్వామివారి పూజకుగాను వివిధ రకాల పూలను ఉపయోగిస్తుండటం జరుగుతుంది. వీటిలో గన్నేరు, ఉమ్మెత్త, జిల్లేడు, పొగడలు, మందారాలు మొదలైనవి ఆదిదేవుడికి అత్యంత ప్రీతికరమైనవి. 
 
ఒక్కోరకం పూలతో శివుడిని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ నేపథ్యంలో 'పొగడపూలు' కూడా ఎంతో విశేషమైనవిగా చెప్పబడుతున్నాయి. 
 
ముఖ్యంగా 'మార్గశిర మాసం'లో శివుడిని అర్చించడానికి 'పొగడపూలు' మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. ఈ మాసంలో పొగడపూలతో శివుడిని పూజించడం వలన సంతోషంతో సంతృప్తిని పొందిన శివుడు, ఇహంలోను ... పరంలోను సుఖశాంతులను ప్రసాదిస్తాడు. అందువలన మార్గశిర మాసంలో మహాదేవుడి అనుగ్రహం కోసం పొగడపూలతో పూజించండి. 

వెబ్దునియా పై చదవండి