వేదాలు, శాస్త్రాలపై ప్రగాఢ విశ్వాసం వుండాలి.. లేకపోతే..?

సోమవారం, 5 అక్టోబరు 2015 (15:57 IST)
మనకు శాస్త్రాల పట్ల ప్రగాఢ విశ్వాసం వుండాలి. అప్పుడే మన జీవితం అర్థవంతమవుతుంది. నీవు ఈ లోకంలోకి నీ కర్మల వలన తిరిగి వస్తావు. మరల మరల జన్మించి, మరణించడానికి కాకుండా.. మోక్షానికే ఈ లోకానికి వచ్చావని శాస్త్రం చెప్తుంది.

ఏ గ్రంథం మన జీవిత విధానాన్ని సన్మార్గంలో నడిపించి, పశుతుల్యమైన మనజీవితాన్ని మోక్షమార్గంలో నడిపిస్తుందో.. మనలో సాత్విక గుణాలను పెంపొందించి, పరమార్థదిశగా ఆలోచించి అడుగులు వేయగలమో చెప్పే గ్రంథాన్ని నమ్మాలి. అంతేగానీ గ్రంథాలు, శాస్త్రాలు ఒకటేనని భ్రమపడవద్దు. 
 
మనది వేద భూమి, కర్మభూమి, వేదాలపట్ల శ్రద్ధ లేకపోవడం గొప్ప అపరాధం. వేదాలు మనకు శ్రేయస్సును కలిగించి, మోక్షమార్గాన్ని చూపే సాధనాలు. వేదాలు, ఉపనిషత్తులు, మన జీవితాన్ని సక్రమమార్గంలో నడిపి, జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. తద్వారా ముక్తిని పొందుతాం. అట్టివేదాలను గౌరవించడం మన విధి అని పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి