సోమవారం ప్రదోషం.. శంఖువులతో శివునికి అభిషేకం చేస్తే..(video)

సోమవారం, 3 ఏప్రియల్ 2023 (12:47 IST)
సోమవారం ప్రదోషం చాలా విశిష్టమైనది. ఈరోజున సాయంత్రం పూట ప్రదోష కాలంలో శివాలయంలో జరిగే అభిషేకాలను వీక్షించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. పరమేశ్వరుడిని  పూజించే కాలం ప్రదోష కాలం. ప్రదోషకాలంలో శివుడు ఆనంద తాండవం చేస్తాడని ప్రతీతి. 
 
ఆ మైమరపును చూసేందుకు సకల దేవతలూ కైలాసాన్ని చేరుకుంటారట. ఆ సమయంలో శివ పూజ చేస్తే, సమస్త దేవతలను పూజించిన ఫలితం చేకూరుతుంది. ముఖ్యంగా "ఓం నమః శివాయ" అనే పంచాక్షరిని జపించినట్లైతే సర్వం శుభం. 
 
అలాగే సోమవారం నాడు అంటే ఈ రోజు (ఏప్రిల్ 3, 2023) ప్రదోషం రావడంతో శివస్తుతి విశేష ఫలితాలను ఇస్తుంది. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. పైగా సోమవారానికి చంద్రుడు అధిపతి. జాతకరీత్యా చంద్రడు మన మనఃస్థితిని శాసిస్తాడు. అందుచేత సోమవారం నాటి ప్రదోష పూజ సుఖసంతోషాలను ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే ఈ రోజున శంఖువులతో స్వామికి అభిషేకం చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు