ఇత్తడి ప్రమిదలతో ఇలా దీపం వెలిగిస్తే..?

శనివారం, 9 ఏప్రియల్ 2022 (16:48 IST)
ఐశ్వర్యం కలగాలన్నా, అష్టైశ్వర్యాలు చేకూరాలన్నా కొబ్బరి చిప్పలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్లలో పోసి, పసుపు రంగు వత్తులతో లేదా పసుపు రంగు నూలు వస్త్రంతో దీపాన్ని వెలిగించాలి.
 
శత్రువులు ఆటంకాలు కలిగిస్తూ వుంటే.. వారు చేస్తున్న అధిగమించాలంటే.. జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేప నూనె, ఇప్పనూనె, ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అలాగే అంతుపట్టి ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు శివాలయంలో ఉత్తరం వైపు, ఉత్తరం దిక్కుగా నువ్వుల నూనెతో 44 రోజుల పాటు దీపారాధన చేయాలి. 
 
అలాగే ఆకస్మిక ఆదాయం కోసం ఇష్టదైవానికి సంబంధించిన దేవాలయంలో ఇత్తడి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేప, ఇప్ప నూనెను సమపాళ్లలో కలిపి, ఐదు వత్తులు, ఐదు ముఖాలుగా వెలిగే విధంగా 44 రోజులు దీపం పెట్టాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు