జనవరి 27 నోరెత్తకండి.. 2017 శుభప్రదం కాదు.. బాబుకు గండం లేదు: శ్రీనివాస గార్గే

సోమవారం, 26 డిశెంబరు 2016 (12:14 IST)
జనవరి 27వ తేదీన మౌనంగా ఉండాలి. ఆ రోజు ఎవరూ నోరెత్తకూడదట. వచ్చే ఏడాది జనవరి 27న మౌని అమావాస్య సమస్యాత్మకమైందని ప్రముఖ సిద్ధాంతి శ్రీనివాస గార్గే వెల్లడించారు. ఆ రోజున ఎవరూ మాట్లాడరాదని, మౌనం పాటించాలని గార్గేయ చెప్పారు. ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ..  ఏటా సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన అనంతరం వచ్చే తొలి అమావాస్యను పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారని చెప్పారు. 
 
ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న శనిగ్రహం 2017 అక్టోబర్ 26న సహజ గమనంతో ధనుస్సు రాశిలోకి ప్రవేశించాల్సి ఉందని.. కానీ ఈ లోపే అతి గమనంతో హడావుడిగా జనవరి 26వ తేదీ రాత్రి 7-31 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుందని శ్రీనివాస గార్గేయ తెలిపారు. ఇలా ప్రవేశించిన శని తిరిగి వృశ్చిక రాశిలోకి జూన్‌ 21వ తేదీకి చేరుకుంటుందని, వృశ్చికరాశిలో కొంతకాలంపాటు ఉండి సహజ గమనంతో అక్టోబర్‌ 26న ధనస్సు రాశిలోకి తిరిగి ప్రవేశిస్తుందని.. అందువల్ల 2017వ సంవత్సరం అంత శుభప్రదమైనది కాదని గార్గే వెల్లడించారు. 
 
అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదవికి ఇచ్చే ఏడాది ఎటువంటి గండం లేదని.. ఆయన సంపూర్ణ ఆయురోగ్యంగా వుంటారని శ్రీనివాస గార్గేయ చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులున్నా.. పాలనకు ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పుకొచ్చారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఉత్పన్నమైన సమస్యలు 2018 వరకూ ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది భూకంపాలు, విమాన ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయని చెప్పారు.
 
కాబట్టి వచ్చే జనవరి 27న రానున్న మౌని అమావాస్య, ఏటా వచ్చే అమావాస్యలా కాకుండా చాలా సమస్యలతో కూడిందని గార్గే పేర్కొన్నారు. ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మౌనంగా ఉండాలని, లేకుంటే మాట్లాడకుండా ఉండలేని వారు ఉదయం 10-30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకైనా తప్పకుండా మౌనంగా ఉండాలని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఆ సమయంలో మాట్లాడితే గ్రహాల ప్రభావం వల్ల మరుసటి రోజు నుంచే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు.

వెబ్దునియా పై చదవండి