సాధారణంగా పసుపు కొమ్ములు పసుపు రంగంలో వుంటాయి. అయితే నలుపు రంగులో వుండే పసుపు గురించి తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. నలుపు రంగులో వుండే పసుపు కొమ్ములు కాళికాదేవి అవతారమని చెప్తుంటారు. ఈ పసుపును కాళీకాదేవికి, కాల భైరవునికి ఉపాసన కోసం వుపయోగిస్తారు.
పసుపు రంగు పసుపు ఇంటి ముందు కడితే.. చేతబడులు పనిచేయవు. వ్యతిరేక శక్తులుండవు. ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది. కోర్టు సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయి. నలుపు రంగు పసుపు కొమ్మును బాగా నూరి రోజూ తిలకంలా నుదుటిపై వుంచితే ధనాదాయం వుంటుంది. ఇంకా శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు వుండవు. రాహు దోషాలను కూడా ఇది తొలగిస్తుంది.