ఇంటి ఆవరణలో జన్మ నక్షత్ర రీత్యా ఏ వృక్షాలు పెంచాలో తెలుసుకుందాం.. అశ్వనీ నక్షత్రం వారు ముష్టి, భరణీ నక్షత్రం వారు ఉసిరికా, కృత్తికా నక్షత్రం వారు అత్తీ, రోహిణీ నక్షత్రం వారు నేరేడూ, మృగశిర వారు చండ్రా, ఆరుద్ర వారు వనచండ్రా, పునర్వసు వారు వెదురును పెంచాలి.
అలాగే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు రావి, ఆశ్లేషా నక్షత్రం వారు నాగకేసరమూ, మఖ వారు మర్రీ, పుబ్బ వారు మోదుగా, ఉత్తరా నక్షత్రం వారు జువ్వీ, హస్త వారు అంబాళమూ, చిత్త మారేడూ, విశాఖ వారు ములువేమూ, అనురాధా వారు పొగడా, జ్యేష్ఠ నీరుద్ది చెట్లను పెంచాలి.
ఇకపోతే.. మూల నక్షత్ర జాతకులు వారు వేగీ, పూర్వాషాఢ వారు పనస, ఉత్తరాషాఢ వారు కూడా పనసను, శ్రవణం వారు జిల్లేడూ, ధనిష్ట వారు నెమ్మీ, శతభిషం వారు కానుగా, పూర్వాభాద్ర వారు ఉత్తరాభద్ర వారు వేపా, రేవతి వారు ఇప్ప చెట్టు పెంచడం శుభ ఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.