గురువారం వ్రతమాచరిస్తే.. బృహస్పతికి కుంకుమ పువ్వు కలిపిన పాలతో?

బుధవారం, 2 మే 2018 (12:48 IST)
గురువారం ఆచరించే వ్రతం ద్వారా సకలసంపదలు, శుభాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా వివాహ అడ్డంకులు తొలగిపోవాలంటే.. గురుభగవానుడు, దేవ గురువు అయిన బృహస్పతిని పూజించాలని వారు సూచిస్తున్నారు. బృహస్పతిని పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు కొలిక్కివస్తాయి.


అలాగే గురువారం పూట లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. బృహస్పతిని గురువారం పూట ఒంటి పూట ఆహారం తీసుకుని లేదా పండ్లు, పాలు, నీరు మాత్రమే సేవించి పూజిస్తే ఈతిబాధలంటూ వుండవు. 
 
వివాహ అడ్డంకులు వున్నవారికి దోషాలు తొలగిపోవాలంటే.. గురువారం వ్రతమాచరించాలి. శుక్లపక్ష గురువారం పూట వ్రతమాచరించేందుకు ప్రారంభించాలి. పసుపు రంగు పుష్పాలు, పసుపు రంగు ధాన్యాలతో కూడిన వంటకాలు, స్వీట్లు, పసుపు రంగుతో కూడిన దుస్తులు ధరించి బృహస్పతికి పూజ చేయాలి. ఇలా చేస్తే వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. 
 
ఇంకా ఆర్థిక ఇబ్బందులు వుండవు. గురువారం పూట ఉపవాసం వుండి గురు భగవానునికి కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయిస్తే.. వివాహ దోషాలుండవు. అలాగే ఉన్నత విద్యను అభ్యసిస్తారు. ఈ వ్రతం ద్వారా ఆర్థిక ఒడిదుడుకుల నుంచి గట్టెక్కడంతో పాటు అనారోగ్య సమస్యలుండవని పండితులు సూచిస్తున్నారు. ఇంకా గురువారం పూట పేద ప్రజలకు చేతనైనంత అన్నదానం చేయడం ద్వారా కోరుకున్న కోరికలునెరవేరుతాయి. 
 
వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే..?
ఏదైనా ఓ మాసంలో శుక్లపక్ష గురువారం రోజున వ్రతం ప్రారంభించాలి. 16 వారాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాల్సి వుంటుంది. ఇలా మూడేళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఉపవాసం.. గురు భగవానుడికి పూజ చేయడం మరిచిపోకూడదు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. పసుపు రంగు దుస్తులు ధరించాలి.

బృహస్పతిని పసుపు రంగు పుష్పాలతో, పసుపు రంగు స్వీట్లతో నైవేద్యం సమర్పించారు. ఆ రోజున ఉపవాసం వుండేవారు ఉప్పులేని ఆహారం తీసుకోవాలి. ఉదయం పూట బృహస్పతిని పూజించి.. సాయంత్రం పూట పసుపు రంగు దుస్తులను దానంగా ఇవ్వాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు