రాశి ఫలితాలు 18-06-2017... అనాలోచితంగా మాట ఇవ్వద్దు

శనివారం, 17 జూన్ 2017 (22:23 IST)
మేషం : మీ సంతానం విద్య, వివాహాల విషయాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు తప్పవు. ఆకస్మిక ఖర్చులు అధికమవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
వృషభం : ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీకు సంఘంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. రవాణా రంగాల వారికి ప్రయాణీకుల తీరు ఆందోళన కలిగిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా యోగదాయకమైన కాలం. 
 
మిథునం : మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఊహించని ఖర్చులు ఎదురైనా ఇబ్బందులు అంతగా ఉండవు.
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైన అధిగమిస్తారు. దైవ దర్శనాలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఆత్మీయులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకు అధికమవుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.
 
సింహం : కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఇల్లుకానీ, ఆఫీసు కానీ మార్చాల్సి రావచ్చు.
 
కన్య: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీల మాటకు ఆదరణ, సంఘంలో గౌరవం లభిస్తాయి. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ, అనాలోచితంగా మాట ఇవ్వడం మంచిది కాదు. మిత్రుల ప్రయోజనాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. విందులలో పరిమితి పాటించండి.
 
తుల : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిరుద్యోగులు ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమించాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల బంధువులతో మాటపడవలసివస్తుంది. సంతానంపై చదువులపై దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యుల సలహా పాటించండి.
 
వృశ్చికం: ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. గృహావసరాలకు నిధులు సమకూర్చుకుంటారు. స్త్రీలకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పెరిగే సూచనలున్నాయి.
 
ధనస్సు : స్త్రీలకు నాణ్యత ధరల పట్ల ఏకాగ్రత ముఖ్యం. వ్యవసాయ, ఎగుమతి, దిగుమతులు లాభిస్తాయి. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంతో  ఉల్లాసాన్ని పొందుతారు. ప్రకటనలు, రాజకీయ, కళారంగాల వారికి ప్రోత్సాహకరం. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
మకరం : కుటుంబీకులతో కలిసి విందు, వేడుకలలో పాల్గొంటారు. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. దూరప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
కుంభం : వాణిజ్య ఒప్పందాలు, భాగస్వామిక చర్చల్లో అనుకూలతలుంటాయి. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు ఎదురవుతాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు.
 
మీనం : సినీ కళాకారుల వల్ల రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. స్కీమ్‌లు వాయిదాల పద్ధతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. నూనె, పెట్రోల్, డీజిల్ వ్యాపారస్తులకు గణనీయమైన అభివృద్ధి కానరాగలదు. ఎప్పటి నుంచి ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది.

వెబ్దునియా పై చదవండి