బుధవారం.. పెసరట్లు తినండి..!

మంగళవారం, 5 ఆగస్టు 2014 (17:51 IST)
బుధవారం.. పెసల పప్పుతో చేసిన వంటలు అంటే పెసరట్లు, పెసరపప్పు పచ్చడి, పెసలతో చేసిన హల్వా, లడ్డు వంటి పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా చింత, సీమచింత పండ్లు స్వీకరించడం కూడా శ్రేయస్కరం. 
 
అదే రోజున ఆదిదేవుడైన గణపతిని దర్శించుకోవడం మంచిదని, సమీపంలోని బొజ్జగణపతి ఆలయానికి వెళ్లి.. గజనాథుడిని దర్శించుకోవడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. బుధవారం రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి గరికను సమర్పించడం ద్వారా ఉన్నత ఫలితాలను పొందవచ్చునని పండితులు అంటున్నారు. 
 
ఇదేవిధంగా.. బుధవారం రోజున ఆకుపచ్చ దుస్తులు ధరించడం శ్రేయస్కరమని పురాణాలు చెబుతున్నాయి. ఆకుపచ్చ దుస్తులు ధరించడం ద్వారా చేపట్టిన కార్యాలు విజయవంతమవడంతో పాటు, శుభ ఫలితాలు చేకూరుతాయి. అదేవిధంగా... స్త్రీలు బుధవారం రోజున ఆకుపచ్చ రంగు పువ్వులు అంటే సంపంగి వంటివి తలలో ధరించడం మంచిది.

వెబ్దునియా పై చదవండి