మీ రాశి వార ఫలితాలు... 20-08-2017 నుంచి 26-08-2017 వరకు...

శనివారం, 19 ఆగస్టు 2017 (22:09 IST)
మిధునంలో శుక్రుడు, కర్కాటకంలో కుజ, రాహువులు, సింహంలో రవి, వక్రి బుధుడు, కన్యలో బృహస్పతి, వృశ్చికంలో వక్రి శని, మకరంలో కేతువు. 21న శుక్రుడు కర్కాటక ప్రవేశం. 25న శనికి వక్రత్యాగం. కర్కాటక, సింహ, కన్య, తుల రాశుల్లో చంద్రుడు. 25న వినాయక చవితి.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కొత్త విషయాలు తెలుసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహమార్పు కలిసివస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. గురు, శుక్ర వారాల్లో దుబారా ఖర్చులు అధికం. ఆత్మీయులకు కానుకలు అందిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. పరిచయస్తుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి. సంకల్పసిద్ధికి జిల్లేడు పత్రాలతో గణేశుని పూజించండి.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు. రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఆకస్మిక ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటారు. మీ విషయాల్లో పెద్దల జోక్యం అనివార్యం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టపడినా ఫలితం వుండదు. శనివారం నాడు ఆలోచనలతో సతమతమవుతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కలువ పూలు, గరికతో వినాయకుని అర్చన కలిసివస్తుంది.
 
మిధునం: మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు, 1,2,3 పాదాలు
ప్రేమానుబంధాలు బలపడతాయి. వాగ్దాటితో ఆకట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఓర్పు, పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దైవ కార్యాలకు వ్యయం చేస్తారు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. అధికారులకు హోదా మార్పు, వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. బెట్టింగ్, జూదాలకు దూరంగా వుండాలి. ఏజెన్సీలు, టెండర్లను చేజిక్కించుకుంటారు. జామ పత్రాలతో విఘ్నేశ్వరుని అర్చన శుభదాయకం. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరిగినా ధనానికి లోటు వుండదు. కొంత మొత్తం ధనం అందుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పనలు హడావుడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. విందులు, వేడుకల్లో మితంగా వుండాలి. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. కార్యసిద్ధికి వినాయకుని గరిక, చామంతులతో పూజించండి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పెట్టుబడులు, ఏజెన్సీలు, లీజు పొడిగింపులకు అనుకూలం. ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని విషయాల్లో పెద్దల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. ఎవరినీ నిందించవద్దు. ఆది, సోమ వారాల్లో పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు ఫర్వాలేదనిపిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయ. వరసిద్ధి వినాయకునికి చామంతులు, మారేడు దళాలతో అర్చన శుభదాయకం.
 
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
గృహంలో సందడి నెలకొంటుంది. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మంగళ, బుధ వారాల్లో అవతలి వారు ఇరకాటం పెట్టేందుకు యత్నిస్తారు. మొహమాటాలకు, ఒత్తిళ్లకు తలొగ్గవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే వుంటాయి. బంధువులకు సాయం అందిస్తారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పట్టుదలతో ఉద్యోగ యత్నం సాగించండి. వ్యాపారాలు వేగవంతమవుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. కార్యసాధనకు గరిక, జిల్లేడు పత్రాలతో వినాయకుని పూజించండి. 
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి. మొహమాటాలకు, పంతాలకు పోవద్దు. గురు, శుక్ర వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. మీ విషయాలు తెలుసుకునేందుకు కొంతమంది యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. గృహ మార్పు కలిసివస్తుంది. పనులు వేగవంతమవుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆందోళన తొలగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులు వుంటాయి. ధనానికి ఇబ్బంది వుండదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, ఉపాధి పథకాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు, పనిభారం. తెల్ల జిల్లేడు, జామ పత్రాలతో వినాయకుని అర్చన శుభం, జయం. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దైవ కార్యాలకు బాగా వ్యయం చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నోటీసులు అందుకుంటారు. ఆస్తి, భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉత్సాహంగా గడుపుతారు. శనివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఏమంత సంతృప్తి వుండదు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. జూదాలు, బెట్టింగుల జోలికి వెళ్లవద్దు. కార్య సాధనకు జామ, జిల్లేడు పత్రాలతో గణేశుని ఆరాధించండి.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం.
ఎదుటివారి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఓర్పుతో మెలగండి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఆది, సోమ వారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోవాలి. ఎవరి సహాయం ఆశించవద్దు. దంపతుల మధ్య దాపరికం పనికిరాదు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. విదేశీ యత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికాలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆశాదృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. గరిక, చామంతులతో వరసిద్ధి వినాయకుని అర్చన కలిసి వస్తుంది. 
 
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు.
గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆప్తుల కలయికతో కుదుటపడుతారు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆర్థిక స్థితి సామాన్యం. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఆకస్మిక ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. విద్యార్థులకు పరిచయాలు సంతృప్తినిస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. క్రీడాకారులకు ఆశాభంగం. గణేశునికి జిల్లేడు, మారేడు దళాలతో అర్చన శుభదాయకం. 
 
కుంభం: ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3 పాదాలు.
పెట్టుబడులకు అనుకూలం కాదు. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. మీ అంచనాలు ఫలిచంకపోవచ్చు. ఆప్తులను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆశాదృక్పథంతో ముందుకు సాగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహం వద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆది, గురు వారాల్లో పనుల్లో ఒత్తిడి, జాప్యం ఎదుర్కొంటారు. దుబారా ఖర్చులు అధికం. ధనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త విషయాలు గ్రహిస్తారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు ప్రకటన పట్ల అవగాహన ప్రధానం. పత్రాలు, నోటీసులు అందుకుంటారు. వ్యవహారానుకూలతకు గణపతిని గరిక, జిల్లేడు పత్రాలతో పూజించండి.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి.
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. మంగళ, శని వారాల్లో ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. మానసికంగా కుదుటపడుతారు. అవకాశాలు కలిసివస్తాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు సామాన్యం. ధనానికి ఇబ్బంది వుండదు. పరిచయస్తులు సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కొంటారు. టెండర్లు, ఏజెన్సీలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వరసిద్ధి వినాయకునికి మారేడు, కలువలతో అర్చన శుభం, జయం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు