సంప్రదింపులు ఫలిస్తాయి. లౌక్యంగా వ్యవహరించాలి. పరిచయంలేని వారితో జాగ్రత్త. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగాలి. బంధుత్వాలు బలపడతాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. గృహమార్పు యత్నం ఫలిస్తుంది. ఖర్చులు సంతృప్తికరం. కొంత మొత్తం ధనం అందుతుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు పరిజ్ఞానం అవసరం. శనివారం తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. సంతానం భవిష్యత్ పైన శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం తగదు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి.
ఈ వారం ఆశాజనకమే. ప్రియతములు ఉల్లాసంగా గడుపుతారు. చిన్నారుల విషయంలో శుభపరిణామాలు సంభవం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అవకాసాలు చేజిక్కించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. రాబోయే ఖర్చులకు డబ్బు సర్దుబాటు చేసుకుంటారు. పనుల హడావుడి సాగుతాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్ద సంస్థలతో భాగస్వామ్యం, లీజు, టెండర్లకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి సంబంధాలు బలపడతాయి.
ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆకస్మిక ఖర్చులు, చేతిలో ధనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. కీలకమైన పత్రాలు, నోటీసులు అందుకుంటారు. వ్యవహారాల్లో అనుకూలతలు, చికాకులు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. ఉద్యోగస్తులకు బాద్యతల మార్పు, పనిభారం. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. పెట్టుబడులకు తరుణం కాదు. ద్విచక్రవాహన చోదకులకు దూకుడు తగదు. షేర్ల విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పొదుపు పథకాలు అనుకూలం. ప్రైవేట్ సంస్థల్లో పొదుపు క్షేమం కాదు. నమ్మకస్తులే మోసగించే ఆస్కారం వుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. చాకచక్యంగా వ్యవహరించాలి. పట్టుదలతో శ్రమించి లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రశంసలు ఉత్సాహపరుస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. పరిచయస్తులకు సాయం అందిస్తారు. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆది, సోమ వారాల్లో నగదు, వస్తువులు జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. టెండర్లు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. వ్యాపారాల్లో అనుభవం గడిస్తారు. ట్రావెలింగ్ రంగాల వారికి కొత్త సమస్యలు ఎదురవుతాయి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. కుటుంబ, ఆదాయ వివరాలు వెల్లడించవద్దు. వేడుకల్లో పాల్గొంటారు. మీ రాక బంధువులను సంతోషపరుస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ప్రశాంతత, దాంపత్య సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక స్థితి ఫర్వాలేదు. ఆదాయా వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సంతానం కోసం బాగా వ్యయం చేస్తారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మంగళ, బుధ వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాభివృద్ధి కోసం శ్రమిస్తారు. షాపుల స్థలమార్పు నిదానంగా ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సేవా, సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సంప్రదింపులకు అనుకూలం. ఏ విషయాన్నీ తెగే దాకా లాగవద్దు. లౌక్యంగా వ్యవహరించాలి. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సన్నిహితుల సాయం అందుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. గురు, శుక్రవారాల్లో పనుల్లో అవాంతరాలు ఎదుర్కొంటారు. విద్యార్థులు చక్కని ఫలితాలు సాధిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం వుండదు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసికంగా స్థిమితపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏమరుపాటు తగదు. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. కీలక సమావేశాలు, సభల్లో పాల్గొంటారు.
---------------------------------------------------------------------------------> తదుపరి పేజీలో చూడండి
ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సంతానం ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తారు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవడం శ్రేయస్కరం. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. పరిచయస్తులు మొహమ్మాటాలకు గురిచేస్తారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. ఆది, సోమవారాల్లో బాధ్యతలు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. అవివాహితులు కొత్త అనుభూతి చెందుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వైద్యరంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. కొన్ని వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. పెద్దల సలహా తీసుకోవడం మంచిది. మంగళ, బుధవారాల్లో సొంత నిర్ణయం వల్ల నష్టపోయే ఆస్కారం వుంది. శుభకార్యాల్లో బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. ప్రయోజనకరం. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. విందులు, వినోదాల్లో మితంగా మెలగండి. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి, వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా ఉండవు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ప్రముఖులను కలుసుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వేడుకలు, శుభకార్యాలకు హాజరవుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విలువైన వస్తువులు, నగదు, ఆభరణాలు జాగ్రత్త. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్తులు అంచనాలకు మించుతాయి. ఇతరులను సాయం అడిగేందుకు మనస్కరించదు. అవసరాలు అతికష్టంమీద నెరవేరగలవు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గురు, శుక్రవారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం, విశ్రాంతి లోపం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి.
ఖర్చులు రాబడికి మించి వుంటాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగిపొందుతారు. మనోధైర్యంతో యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలు కాగలవు. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. శనివారం నాడు దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం చదువుల గురించి ఆలోచిస్తారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవడం మంచిది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు, నష్టాలను అధిగమిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు.
శుభకార్యాన్ని ఆడంబరంగా చేస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం విజయం సంతోషపరుస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో చికాకులు తొలగిపోతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పదవుల స్వీకరణకు అనుకూలం. ఆది, సోమవారాల్లో గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. పరిచయాలు విస్తరిస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ధనానికి ఇబ్బంది ఉండదు. బంధువులు ధనసహాయం ఆశిస్తారు. కొంత మొత్తం సాయం చేసి వారిని సంతృప్తిపరచండి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఎవరికీ హామీలివ్వొద్దు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులు షాపు పనివారలతో జాగ్రత్త. వృత్తి నైపుణ్యత పెరుగుతుంది. ప్రయాణం, దైవదర్శనాలలో ప్రయాసలెదుర్కుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకుంటారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. దంపతుల కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం ఉన్నత చదువుల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం, ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆహ్వానం ఆలోచింపడేస్తుంది. మంగళ, బుధవారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. పెట్టుబడులకు అనుకూలం కాదు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి.