మీ వార రాశి ఫలితాలు... 22-04-2018 నుంచి 28-04-2018 వరకు(Video)

శనివారం, 21 ఏప్రియల్ 2018 (23:06 IST)
మేషంలో రవి, వృషభంలో శుక్రుడు కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, కుజులు, మకరంలో కేతువు. మీనంలో బుధుడు. మిధున, కర్కాటక, సింహ, కన్యలలో చంద్రుడు. 28న శని త్రయోదశి. వృషభ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించిన శుభం, జయం. 26న సత్యదేవుని కల్యాణం. 28న నృహింహుని జయంతి.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
పెద్దల సలహా పాటించండి. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. గృహ మార్పు అనివార్యం. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆలోచనలు కొలిక్కి వస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుతాయి. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. మీపై శకునాల ప్రభాం అధికం. శనివారం నాడు అనవరసర జోక్యం తగదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమెుత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2, పాదాలు
ఈ వారం ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంప్రదింపులు ఆశాజనకంగా సాగుతాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఆర్ధిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. దళారులు, ప్రకటనలు విశ్వసించవద్దు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఫోన్ సందేశాల పట్ల అవగాహన ప్రధానం. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
మిధునం: మృగశిర 3,4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1,2,3 పాదాలు
వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. చిరువ్యాపారులకు ఆశాజనకం. మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వేడుకలు, శుభకార్యంలో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. అవసరాలు నెరవేరుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. అలవాటు లేని పనులు చేపట్టవద్దు. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు. ప్రయాణం కలిసివస్తుంది.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
బంధుత్వాలు, పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వశించవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. వివాదాలు సద్దుమణుగుతాయి. ఆందోళన తొలగి కుదుటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆది, సోమ వారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది, ధనం మితంగా వ్యయం చేయండి. క్రయవిక్రయాలు లాభిస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
స్వయంకృషితో రాణిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. రుణ విముక్తులవుతారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త, మంగళ, బుధ వారాల్లో మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు కొలిక్కి వస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మెరుగైన ఫలితాలనిస్తాయి. స్వల్పకాలిక పెట్టుబడులకు అనుకూలం. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి.
 
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు.
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కృషి ఫలిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. గురు, శుక్ర వారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. కొత్త వ్యక్తులు తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. పనులు మెుండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. సంతానం చదువులపై  శ్రద్ధ వహిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
శుభకార్యానికి శ్రీకారం చుడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. ఆచితూచి వ్యవహరించండి. పెద్దల సలహా పాటించటం శ్రేయస్కరం. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. మీ శ్రమ వృధా కాదు. కొంత మెుత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. శనివారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సహోద్యోగులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. మీ వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆది, సోమ వారాల్లో సంతానం అత్యుత్సాహాం ఇబ్బంది కలిగిస్తుంది. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు నిదానంగా సానుకూలమపుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సాంకేతిక, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. కీలక పత్రాలు జాగ్రత్త. అపరిచితులను విశ్వసించవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా వ్యహరించాలి. తొందరపాటుతనం వల్ల నష్టపోవలసి వస్తుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు తప్పవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. భాగస్వామిక చర్చలు వికటిస్తాయి.
 
మకరం: ఉత్తరాషాడ, 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. శుభకార్య యత్నం ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. ఆచితూచి వ్యవహరించాలి. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. పనులు హడావుడిగా సాగుతాయి. శనివారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం వద్దు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు అనివార్యం. హోల్ సేల్ వ్యాపారులకు ఆశాజనకం. క్రీడాకారులకు నిరుత్సాహం. 
 
కుంభం: ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆర్థిక స్థితి ఆశాజనకం. రుణ బాధలు తొలగుతాయి. కొంత మెుత్తం ధనం అందుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూరం దాల్చుతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. పనులు వేగవంతమవుతాయి. మంగళ, శని  వారాల్లో అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రియతముల రాక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడుల విషయాల్లో పునరాలోచన అవసరం. ఉద్యోగస్తులకు పదోన్నతి, నగదు లాభం. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుకుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో ముందుకు సాగండి. నేడు అనుకూలించని పరిస్థితులు రేపు అనుకూలిస్తాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. కొత్తవారితో సంప్రదింపులు జరుపుతారు. గురు, శుక్రవారాల్లో మెుహమాటాలకు పోవద్దు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. అయిన వారికి సాయం అందిస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు కొత్త బాధ్యతలు, విశ్రాంతి లోపం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు