గోరింటాకును ఇష్టపడని మహిళలంటూ ఉండరు. పండుగైనా, ఫంక్షనైనా గోరింటాకు పెట్టాల్సిందే. అలాంటి గోరింటాకును ముఖ్యంగా ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే..? ఆషాడంలో ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోవాల్సిందే. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది.