గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే..?

సోమవారం, 31 జులై 2017 (09:14 IST)
వారానికి ఒక సారి ప్రధాన ద్వారపు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాల్సిందేనని పంచాంగ నిపుణులు అంటున్నారు. అలాకాకపోయినా పర్వదినాల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు తప్పసరిగా పెట్టాలి. అప్పుడే దుష్టశక్తులు ఇంటిలోనికి రావు. ఇంటి గడపకు పైన నల్లటి తాడుతో పటిక తప్పనిసరిగా కట్టండి. శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసి కట్టినచో దృష్టి తొలగిపోతుంది. పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టడం ఇంటికి సౌభాగ్యాన్నిస్తుంది.
 
అలాగే ఇంట్లో వారానికి ఒకసారి శుక్రవారం పూట లేదంటే, శని, గురువారాల్లో తప్పకుండా దీపారాధన చేయాలి. ప్రతిరోజూ చేసినా చాలా మంచిది. ఇక పూజాగదిని ఎప్పుడు శుభ్రంగా వుంచుకోవాలి. వీలైనంతవరకు రెండు లేదా మూడు పటాలను మాత్రమే పూజా గదిలో ఉంచాలి. 
 
మీ సన్నిహితులు, బంధువులు ఇచ్చిన చిన్న దేవుళ్ళ ఫోటోలతో పూజా మందిరాన్ని నింపకూడదని పంచాంగ నిపుణులు అంటున్నారు. పూజా మందిరం ఎంత కళకళలాడితే అంతగా మన జీవితాలు కళకళలాడుతాయని పండితులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి