ఆర్థికపరమైన ప్రశాంత జీవితం కోసం ఏం చేయాలి!?

శుక్రవారం, 18 మే 2012 (17:47 IST)
FILE
ఆర్థికపరమైన ప్రశాంత జీవితం కోసం ఏం చేయలంటే.. మీ ఆదాయంలో కొంత శాతమైనా నెల చివరలో మీ చేతిలో ఉండాలి. మీ ఆదాయంలో కనీసం ఇరవై శాతమైనా పొదుపు చేయాలి.

పొదుపును నెలలో మొదటి ఖర్చుగా భావించాలి. ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్కరాసి, ముందు ముందు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి.

అవసరమైన వస్తువుల జాబితాను తయారు చేసుకుని షాపింగ్‌కు వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఏ వస్తువునైనా స్వయంగా వెళ్ళి కొనడమనే పద్ధతిని అలవరచుకోవాలి. పనివారిని పంపరాదు.

రాబడి కంటే తక్కువ ఖర్చు చేస్తూ ఆదా చేయడం వైపు మొగ్గు చూపాలి. సాధ్యమైనంత వరకు అప్పు చేసే పరిస్థితులను కల్పించుకోకూడదు. వాయిదాల పద్ధతిలో వస్తువులను కొనడం కచ్చితంగా లాభకరం కాదని గమనించండి.

వెబ్దునియా పై చదవండి