ఆర్థిక వ్యవహారాల్లో ఆడవారిది ప్రేక్షక పాత్రేనా?

గురువారం, 12 మార్చి 2015 (17:35 IST)
మగవారే ఎందుకు డబ్బు వ్యవహారాలు చూస్తారు? ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు? ఈ ఆర్థిక వ్యవహారాలలో ఆడవారిది ప్రేక్షక పాత్రేనా ? ఈ ఆర్థిక వ్యవహారాల పట్ల మహిళలలో అంత ఆసక్తి లేకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులయినా ఆర్థిక వ్యవహారాలన్నీ భర్తే చూస్తుండటం జరుగుతుంది. 
 
వాస్తవానికి ఆర్థిక విషయాలలో మగవాళ్ళ ప్లానింగ్‌లో ముందుచూపు కనిపిస్తుంది. రేపటి అవసరాల కోసం ఎంతోకొంత వెనకేయాలన్న ఆలోచన వాస్తవరూపం ధరించడంలో ఆడవారి సహకారం కూడా అవసరమే. ఆర్థిక వ్యవహారాల్లో పొదుపు చేయడంలో, ఆదాయం వచ్చే మ్యూచువల్ ఫండ్, డిపాజిట్స్, షేర్లలో పెట్టుబడి పెట్టి ఆర్థిక ఫలితాలను సాధించడంలో మీ వారు చూసే చొరవను, నేర్పును మీరు కూడా ఆకళింపు చేసుకోవాలి. 
 
స్త్రీ పురుషుల మధ్య మేధోవికాసానికి సంబంధించి వివిధ అంశాలతో పాటు ఆర్థిక వ్యవహారాల నిర్వహణ నైపుణ్యం ఒక సాంస్కృతి పరిణామంగా భావించవచ్చు. అందుకే మహిళలకు కూడా ఆర్థిక వ్యవహారాల్లో భాగం కావాలని మానసిక నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి