షాపింగ్‌‌లో ఒకేలాంటి వస్తువులు కొంటున్నారా?

బుధవారం, 10 సెప్టెంబరు 2014 (18:25 IST)
మార్కెట్‌లో పలురకాలు వస్తువులు ఉంటాయి. వాటిలో ఏదిలో అవసరమో కొనుక్కోవాలి. మ్యూజిక్ సిస్టమ్ ఒకప్పుడు ప్రతి ఒక్కరు ముచ్చటపడి కొనుక్కునేవారు. ఐతే ఇప్పుడు ఆ మ్యూజిక్ వినటానికి ఒకటికన్నా ఎక్కువ సాధనాలు వచ్చాయి. సెల్‌ఫోన్‌లోనే సంగీతం వినొచ్చు. ఐపాడ్ వచ్చింది. 
 
కంప్యూటర్ ఉంటే చాలు అన్నిరకాల సంగీతాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా సంగీతాన్నివిని ఆనందించవచ్చు. కాని అటువంటి వాటినన్నంటిని డబ్బు పెట్టి కొంటారు. ఒక్క సంగీత విషయంలోనే కాదు. ఇతర అంశాలలో కూడా ఒక పని కోసం అనేక వస్తువులు కొనిపెట్టుకునేవారు. 
 
కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. కాబట్టి ఒకేలాంటి వస్తువులు కొనిపెట్టకుండా అవసరానికి తగ్గట్టు కొనుక్కోవడం మంచిది. దీంతో డబ్బు ఆదాతో పాటు ఒకేలాంటి వస్తువులతో మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు.  
 

వెబ్దునియా పై చదవండి