మహిళలు కెరీర్‌లో ముందడుగు వేయాలంటే ఈ టిప్స్ పాటించండి. అంతవరకూ ఎదురుకాని ఓ సమస్య ఎదురైనప్పుడు దానిని ఎదుర్కోవాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారా? అయితే ఆ సవాల్‌ని స్వీకరించాలా వద్దా అన్న సంఘర్షణకు లోనవుతారు.
కానీ అలాంటప్పుడు సవాల్‌ని అంగీకరించడానికే ముందడుగు వేయాలని మానసిక నిపుణులు అంటున్నారు. ఒక వేళ ఆ సమస్యని పరిష్కరించ లేకపోయినా కూడా ఓ కొత్త విషయం తెలుసుకున్నాం అన్న ఆత్మివిశ్వాసం దీనివల్ల కలుగుతుంది.
అందరి చేతా మంచి అనిపించుకోవాలన్న తాపత్రయాన్ని మహిళలు ఎక్కువగా కనబరుస్తారు. ఇదే మహిళల కెరీర్‌కు పెద్ద ప్రతికూలాంశం అంటారు నిపుణులు. ఇదొక రకంగా బలహీనత. దీనిని ఎదుర్కొంటే తేలిగ్గా బృందాన్ని నడిపించగల సామర్థ్యం, ఆత్మవిశ్వాసం వస్తాయి.