సామాజిక మాధ్యమాల వలన ఈ రోజుల్లో స్నేహం విస్తరించుకోవడం సహజమే. కానీ ఆ స్నేహాలను కొనసాగించడం కూడా తెలుసుకోవాలి. మరి అదెలాగో చూద్దాం. స్నేహితులతో ఉన్నపాత జ్ఞాపకాలు గుర్తువావడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అయితే ఎప్పటికప్పుడు కొత్త అనుభూతులు, జ్ఞాపకాలు కూడా ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా స్నేహితులంతా కలుసుకుని గడిపేందుకు ప్రయత్నించాలి.
ఎంత మీ స్నేహితురాలైనా సరే వాళ్లకంటూ వ్యక్తిగత జీవితం, కొన్ని బాధ్యతలు ఉంటాయని ఎప్పుడు మరవకూడదు. మీరు పెట్టిన సందేశాలకు సమాధానాలు ఇవ్వకపోయినా, ఫోన్స్‌లో మాట్లాడకపోయినా స్నేహితులకు అర్థం చేసుకునేలా ఉండాలి. స్నేహితులే కదా మనం చెప్పినవన్నీ చేస్తారనుకోవడం మాత్రం ఎప్పుడు సరికాదు.