మహిళలూ ప్రతిరోజూ హాయిగా గడపాలంటే?

బుధవారం, 1 అక్టోబరు 2014 (14:16 IST)
మహిళలూ ప్రతిరోజూ హాయిగా గడపాలంటే.. ముందుగా ఒత్తిడిని దూరం చేసుకోవాలి. సీజన్‌కు తగ్గట్లు మూడ్‌ను మార్చుకోవాలి. చిరాకులకు స్వస్తి చెప్పాలి. ముఖ్యంగా ఇంటినే జిమ్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. అయితే అందుకు కాస్త శ్రద్ధ అవసరం. 
 
ఇల్లే కదా అని ఎప్పుడంటే అప్పుడు కాకుండా క్రమం తప్పని అప్పాయింట్‌మెంట్ మాదిరి ఉండాలి. ఏదొక కారణం చెప్పుకొని ఎగ్గొట్టే ప్రయత్నాలు చేయకూడద. దుస్తులు, షూస్ కూడా సౌకర్యంగా ఉండాలి. ఇంట్లో వారినీ టైమింగ్ మెయింటైన్ చేసేలా చూడాలి. 
 
ఎప్పుడూ ఫోన్లు మాట్లాడటం తగ్గించాలి. ఇంటిపనిని కచ్చితమైన టైమింగ్ ప్రకారం పూర్తి చేయాలి. సంగీతం వింటూ వర్కవుట్లు సాగిస్తే మరింత ఎంజాయ్ చేయవచ్చు. చేసే సమయం కూడా అలా తెలియకుండానే సాగిపోతుంది. వీటికి తోడు ఎక్సర్‌సైజ్ డైరీ మెయింటెయిన్ చేస్తే సాధిస్తున్న విజయం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటుంది. 
 

వెబ్దునియా పై చదవండి