అవసరాన్నిబట్టి, అవకాశాన్నిబట్టి, బలాన్నీ, బుద్ధిని ఉపయోగించి కార్యాన్ని సాధించుకురావడంలో హనుంమతుడికి గల నేర్పు అంతా ఇంతాకాదు. రాముడిని సేవించడం వలన కలిగే ఆనందం ఈ విశ్వంలో మరేదీ ఇవ్వలేదని చెప్పిన హనుమంతుడు తనని సేవించే భక్తులకు కూడా అదే స్థాయి సంతోషాన్ని కలిగిస్తుంటాడు.
ఈ కారణంగానే అనేక ప్రాంతాలలో గల హనుమంతుని క్షేత్రాలు నిత్యం భక్తుల రద్దీతో సందడిగా కనిపిస్తుంటుంది. సాధారణంగా అనారోగ్యాల కారణంగా బాధలుపడుతున్నవాళ్లు గ్రహ సంబంధమైన దోషాల వలన ఇబ్బందులను ఎదుర్కుంటున్నవాళ్లు, విద్యా సంబంధమైన విషయంలో వెనుకబడుతోన్న వాళ్లు హనుమంతుడి క్షేత్రాలను దర్శిస్తుంటారు. ఆ స్వామి ఆశీస్సులను అనుగ్రహాన్ని కోరుతుంటారు.
ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పూజ మందిరంలో హనుమంతుడి వెండి ప్రతిమకు పూజాభిషేకాలు జరపవలసి ఉంటుంది. నియమనిష్టలను పాటిస్తూ వ్రతాన్ని పూర్తి చేసి, స్వామివారికి ఇష్టమైన అప్పాలను నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. దగ్గరలోని హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఆ స్వామికి ఆకుపూజ చేయించి అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి.