గురువారం నాడు జామపండును నైవేద్యంగా పెడితే..?

బుధవారం, 3 అక్టోబరు 2018 (14:01 IST)
గురువారం అంటే గురుభగవానునికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున పసుపు రంగు దుస్తులను ధరించి ఈ స్వామివారికి పూజలు చేయడం వలన వీరి అనుగ్రహం దక్కుతుందని పురాణాలలో చెబుతున్నారు. గురువారం రోజున జామపండ్లను, శెనగలతో తయారుచేసిన పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి.
 
ఈ రోజున స్త్రీలు పసుపు రంగు పువ్వులు పెట్టుకుని స్వామివారిని ఆరాధించడం వలన సిరిసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అలానే ఈ రోజు మామిడి, నిమ్మ, సపోటా పండ్ల జ్యూస్‌లను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. గురుభగవానునికి శెనగపిండితో తయారు చేసిన వంటకాలు నైవేద్యంగా సమర్పించడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు