కార్తీక మాసంలో మోదుగు ఆకులో భోజనం చేయండి!

బుధవారం, 29 అక్టోబరు 2014 (18:38 IST)
కార్తీక మాసంలో మోదుగు ఆకులో భోజనం చేయడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. మోదుగు ఆకులో భోజనం చేయడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు చేకూరుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి.
 
కార్తీక మాసంలో తలస్నానం, తులసి, ఉసిరిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు, దీపారాధనలు, ఉపవాసాలు, వనభోజనాలు చేయాలి. అయితే ఈ మాసమంతా ఉల్లి, వెల్లుల్లి, నువ్వులు, వంకాయ, గుమ్మడికాయతో చేయబడిన పదార్థాలను స్వీకరించకూడదు. అలాగే భోజనాలు చేయడానికిగాను లోహ సంబంధమైన కంచాలు ఉపయోగించకూడదనేది ఒక నియమం ఉంది.

వెబ్దునియా పై చదవండి