మహా మృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేస్తే..?

శనివారం, 21 జూన్ 2014 (14:07 IST)
"ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్" - దీనికి అర్థం అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమశివుడిని మేము పూజిస్తున్నాము. పండిన దోసకాయ తొడిమ నుండి వేరుపడినట్లుగానే మమ్మల్ని కూడా అమరత్వం కొరకు మృత్యువు నుండి విడుపించు కాకా అని అర్ధం. 
 
మహా మృత్యుంజయ మంత్రాన్ని ఉచ్ఛరిస్తే భయాలుండవు. ఒత్తిడి, విచారం, అనారోగ్యం లేదా ఆకస్మిక మరణ భయం ఏర్పడినప్పుడు ఈ మంత్రం యొక్క శక్తి స్వస్థత చేకూర్చి కాపాడుతుంది. 
 
ఈ మంత్రాన్ని ఎలా జపించాలంటే...?ఒక వ్యక్తి ఈ మంత్రమును 108 సార్లు ఉచ్చారణ చేయవచ్చు. ఎందుకంటే మంచి గణాంక మరియు ఆధ్యాత్మిక విలువ కలిగి ఉంటుంది. అంతేకాక 12 మరియు 9 గుణకారం మొత్తం 108 అవుతుంది. ఇక్కడ 12 రాశిచక్రాలను,9 గ్రహాలను సూచిస్తుంది. మానవులు అన్ని గ్రహాలు మరియు రాశిచక్ర చిహ్నాలకు బదులుగా జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులు తగ్గి జీవితం సులభం మరియు ప్రశాంతంగా ఉండటానికి ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా జపించవచ్చు. ఇది ఏకాగ్రతను మెరుగుపరచి మంచి నిద్రకు సహాయపడుతుంది. 
 
మహా మృత్యుంజయ మంత్రం యొక్క ప్రాముఖ్యత: మహా మృత్యుంజయ మంత్రం జపించుట వలన కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. గాయత్రి మంత్రం వలె మహా మృత్యంజయ మంత్రం పరమ పవిత్రమైనది. క్షీర సాగన మథనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఈ మంత్రం ఒక విధమైన మృత సంజీవని అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆపదలు కలిగినపుడు కూడా చదువుకోవచ్చు. సాధారణంగా మూడుసార్లు కానీ, తొమ్మిది సార్లు గానీ బేసి సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు. 

వెబ్దునియా పై చదవండి