నీళ్లు కదులుతూ వుండని పక్షంలో నావ నడవదు. మనం నీళ్లను సేవించలేం. వాయువు కదులుతూ వుండనట్లయితే మనం గాలిని పీల్చుకోలేం. అగ్ని కూడా తన కణాలను ఒకదానికొకటి కదులుతూ వుండకపోతే మంట నిలవలేదు. మనం వంటను చేసుకోలేం. ఆకాశం అనేది కదలని పక్షంలో గ్రహాల పరిభ్రమణమే వుండదు. వీటన్నిటినీ తీర్చుతూ ఈ విశ్వాన్ని నడిపించేది అమ్మ అని దీని అర్థం.