నా గర్ల్‌‌ఫ్రెండ్ మరో అబ్బాయిని ప్రేమిస్తుందా?

బుధవారం, 9 అక్టోబరు 2013 (17:33 IST)
File
FILE
నా పేరు కిషోర్. హైదరాబాద్‌ ఉద్యోగం చేస్తున్నా. నాకు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంది. ఆమెను వదిలి ఉద్యోగరీత్యా ఇక్కడకు వచ్చాను. మేమిద్దరం అమితంగా ప్రేమించుకున్నాం. ఒకరంటే ఒకరికి ప్రాణం. తను ఏం చేసినా నాకు చెపుతుంది. నేనూ అంతే. అయితే, ఈ మధ్య తనకు ఫోన్ చేసి పబ్ పార్టీకి వెళతానంది. నేను వద్దని చెప్పా. అయినా వినకుండా వెళ్లింది. ఎపుడూ నా మాట పెడచెవిన పెట్టలేదు. ఇపుడు కాదని వెళ్లింది. బహుశా.. నన్ను కాదని మరో అబ్బాయి ప్రేమలో పడి ఇలా చేస్తుందేమోనన్న సందేహం. దీని తెలుసుకునేదెలా? ఆమెను వీడి ఉండలేను. అలాగని, ఆమె ప్రవర్తనలో మార్పు రావడం జీర్ణించుకోలేక పోతున్నా. ఏం చేయాలి?

ఒకరంటే ఒకరికి ప్రాణమని చెపుతున్నారు. అదేసమయంలో ఆమె ప్రవర్తనను మీరు సందేహిస్తున్నారు. ఇలాంటి నమ్మకం లేని బంధం ఎక్కువకాలం నిలవదు. మిమ్మలను మీ గర్ల్‌ఫ్రెండ్ సందేహిస్తే మీరు సహించగలరా? ఇలా అనుమానిస్తుంటే ఇద్దరి జీవితాలు ప్రశాంతంగా ఉండవు. అందువల్ల ఈ సమస్యకు ఒకటే పరిష్కారం.. మీరిద్దరూ విడిపోవడమే. ఒకరిపై ఒకరు సందేహాలు పెట్టుకుంటూ జీవిత పయనం సాగించలేరు. అందువల్ల ఇపుడే దూరంగా ఉండటం మంచిది. ఇద్దరి జీవితాలు బాగుంటాయి.

వెబ్దునియా పై చదవండి