ప్రేమించా.. పెళ్లి చేసుకోలేక పోయా.. సెక్స్‌కు ప్రపోజ్ చేయవచ్చా?

బుధవారం, 8 మే 2013 (16:13 IST)
File
FILE
చాలా మంది యువకులు తమకు నచ్చిన యువతులను ప్రేమిస్తుంటారు. ఇలాంటి వారిలో చాలా మంది నిజమైన ప్రేమికులు కూడా ఉంటారు. వీరిలో చాలా మంది పెళ్లి చేసుకోలేక పోతారు. పెద్దల కుదిర్చిన పెళ్లి చేసుకుంటుంటారు. ఇలాంటి ప్రేమికులు కొన్నేళ్ల తర్వాత కలుస్తుంటారు. ఆ సమయంలో తమ మధ్య ఉన్న ప్రేమ బంధం చిగురించి, తిరిగి ప్రేమికులుగా మారిన సందర్భాలు అనేకం ఉంటాయి.

ఇలాంటివారిలో కొంతమందిలో ప్రేమించిన అమ్మాయిని ఎలాగో పెళ్లి చేసుకోలేక పోయాం.. కనీసం సెక్స్‌‌కు ప్రపోజ్ చేయాలన్న భావన వారి మదిలో ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణాలను పరిశీలిస్తే... ఇలాంటి ఆలోచనలు రావడం స్వార్థంతో కూడుకున్నదే. ప్రేమించి పెళ్లి చేసుకోక పోవడం ఒక మోసం.. ఇపుడు చాలా యేళ్ళ తర్వాత కనిపించిన ప్రియురాలి వద్ద సెక్స్ చేయాలని ప్రతిపాదించడం మరో తప్పు అని అంటున్నారు.

అయితే, తన భర్తతో ఆమె శృంగారం సంతృప్తి పొందలేకనో.. మరే ఇతర కారణాల వల్లో భర్తకు దూరమైనట్టయితే.. అలాంటి వారిని చేరదీయడంలో తప్పులేదని చెపుతున్నారు. అంతేకానీ, మాజీ ప్రియురాలి జీవితంలో కేవలం సెక్స్ అనుభవమే ధ్యేయంగా వెళ్ళాలన్న ఆలోచన మంచిది కాదని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి