భార్యతో పొద్దస్తమానం వెటకారం... రాత్రికి రొమాన్స్... ప్చ్ వర్కవుట్ కాదు!!

సోమవారం, 14 నవంబరు 2011 (13:40 IST)
WD
చాలామంది పురుషపుంగవులు రాత్రిపూట భార్యతో సాగించే శృంగారమే తమ బంధాన్ని గట్టిగా పట్టి ఉంచుతుందని అనుకుంటారు. కానీ అది తప్పు అని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. భార్యాభర్తల మధ్య బంధం ఎక్కువకాలం సజావుగా ఉండటంలో రొమాన్స్ ఒక్కటే కీలకం కాదని, ఆలుమగల అనుబంధాన్ని ఇంకో పది విషయాలు 98 శాతం ప్రభావితం చేస్తాయని వెల్లడైంది.

రొమాన్స్ పాత్ర కేవలం రెండు శాతమే ఉంటుందని తేలింది. అందులో ప్రధానమైనది కటుంబ సంతోషం కోసం భార్యాభర్తలు ఆ "పని" సమయాన్ని ఖచ్చితంగా త్యాగం చేయడం. ఏకాంతానికి సమయాన్ని కేటాయించుకోవడం అవసరమని తేలిందట.

ఆర్థిక స్వాతంత్ర్యం విషయంలో భార్య పాత్రను గుర్తించడం, నిర్ణయం తీసుకునే ముందు పరస్పర అవగాహన కూడా కీలకమని ఆ పరిశోధనలో తేలింది. అదే సమయంలో పురుషుడు పట్టువిడుపులకు పోకుండా పరిస్థితిని సానుకూలంగా ఆలోచిస్తే ఫలితముంటుందట.

ఇరువురికి ముఖ్యమైన రోజులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడం, ఆయా సందర్భాల్లో శుభాకాంక్షలు తెలుపుకుంటే బంధం మరింత దృఢమవుతుందని పరిశోధనా సారాంశం. ఎంతటి చికాకులోనైనా చిరునవ్వును దూరం చేయకపోవడం, సంతానం విషయంలో భర్త శ్రద్ధ భార్య మనసు గెలుచుకుటుందట.

సరసంలో చమత్కారం మంచిదేకానీ, అదేపనిగా వెటకారాలు కాపురాలకు చేటు చేస్తాయని పరిశోధనలో వెల్లడైంది. దురలవాట్లను తగ్గించుకోవడం ద్వారా భార్య మనసు గెలుచుకోగలరనీ, భార్యలు షాపింగ్ ప్రపంచం నుంచి బయటపడితే పురుషులు ఊపిరి పీల్చుకుంటారని పరిశోధనలో తేలింది.

వెబ్దునియా పై చదవండి