తప్పు చేస్తే తగ్గండి.. భార్యాభర్తల మధ్య ఆ గ్యాప్ రాదు..

బుధవారం, 15 ఏప్రియల్ 2020 (19:07 IST)
భార్యాభర్తల మధ్య అది తగ్గితే మాత్రం కష్టం అంటున్నారు.. మానసిక నిపుణులు. అదేంటంటే.. అన్యోన్యత. అది తగ్గితే మాత్రం భార్యాభర్తల మధ్య గ్యాప్ వస్తుందని వారు చెప్తున్నారు. ఇద్దరిలో ఎవరిపైన తప్పు చేశారని తెలిసిన తరువాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యి గ్యాప్ మొదలౌతుంది. ఆ గ్యాప్‌ను వీలైనంత త్వరగా సర్దుకుపోయి పూడ్చుకునే ప్రయత్నం చేయాలి తప్పించి, మరో విధంగా ఉండకూడదు.
 
కేవలం అభిప్రాయాలను పంచుకునే విషయంలో మాత్రమే కాదు... శృంగారం విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అప్పుడే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా దానిని భాగస్వామితో చెప్పి ఆ బంధాన్ని నిలబెట్టుకునే విధంగా చూసుకోవాలి.
 
అంతేకాదు, జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కొంతసమయం ఇంటికి, భాగస్వామికి కేటాయించినపుడు ఆ జీవితం సంతోషంగా వుంటుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు