ఈ రోజుల్లో ఆడ, మగ అని తేడా లేకుండా చాలా మంది ఇళ్లలో కంటే కూడా ఎక్కువ సమయం ఆఫీసుల్లోనే గడిపేస్తున్నారు. పని చేసే చోట సానుకూల దృక్పథం అవసరం. అది లేకపోతే చాలా కష్టం. అయితే కొన్ని పనులు చేస్తే, ఇంకొన్ని మానేస్తే ఉత్సాహంగా ఉండటం సాధ్యమే అంటున్నారు నిపుణులు.
సహ ఉద్యోగులతోను, వారి పనినతంపై నిరంతరం సమీక్షించడం, వాళ్ల సామర్థ్యాలతో పోల్చుకుని ఆత్మన్యూనతకు లోనుకావడమే ప్రధానంతో సంతోషాన్ని కోల్పోవడానికి కారణమని కెరీర్ నిపుణులు అంటున్నారు. దానికి బదులుగా వారితో స్నేహంగా ఉండటం, కెరీర్ లక్ష్యాలను సాధించుకుంటూ ముందుకెళ్లడం వంటివి సంతృప్తిని సంతోషాన్ని కలిగిస్తాయని చెబుతారు నిపుణులు.