ఎదుటివారిని డామినేట్ చేసే వారితో ఎలా?

శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:15 IST)
కొంతమంది ఎదుటివారిని డామినేట్ చేస్తూ వుంటారు. ఇలాంటివారిని భరించేది ఎలా అనుకుంటున్నారా? అయితే చదవండి మరి. డామినేట్ చేసేవారిని భరించాలా, దూరంగా వుంచాలా అన్న విషయంలో ఒకే రూల్‌ను అందరికీ అనువర్తింపజేయడం కష్టం. 
 
జీవితం పట్ల ఎంతో అనుభవం, ఆత్మ విశ్వాసం గలవారు కొందరు అతిశయంతో తోటివారిని ముఖ్యంగా సన్నిహితులను డామినేట్ చేస్తే కొందరు బాధ్యతగా సన్నిహితులకు సలహాలిస్తుంటారు. 
 
అయితే ఇలా సలహాలు ఇచ్చే క్రమంలో మన ప్రవర్తనమై వారు అదుపు సాధిస్తుంటారు. కొన్నిసార్లు మన భావాల్ని, ప్రవర్తనను శాసిస్తారు కూడా. అతిశయంతో చేసే శాసనాల్ని ఆమోదించాల్సిన అవసరం లేదు. 
 
దీనివల్ల కొన్నిసార్లు స్వాతంత్ర్యాన్ని కోల్పోయిన భావం కలగడమూ కద్దు. అయితే బాధ్యతగా వ్యవహరిస్తూ సలహా ఇచ్చేవారిని సులువుగా తోసిపుచ్చడం కుదరదు. 
 
ఇష్టం అనుకుంటే వాటిని కొంత పరిగణనలోకి తీసుకోవడంలో తప్పలేదు. డామినేట్ చేసి ఎదుటి వ్యక్తుల తీరు అనుసరించి వారి పట్ల వైఖరిని ఏర్పరచుకోవాలని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి