మిత్రులు లేనివారి మానసిక ఆరోగ్యం బలహీనం

బుధవారం, 30 మార్చి 2016 (09:49 IST)
మనుషుల మానసిక ఆరోగ్యం బాగుండాలంటే స్నేహితులు ఎక్కువమంది ఉండాలట. ఈ విషయాన్ని తాజాగా శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా నిరూపించారు. ఎక్కువ స్నేహితుల బృందాన్ని కలిగి ఉన్నవారే మానసికంగా ఆరోగ్యం పరంగా బాగుంటారని ఆ పరిశోధనలో వెల్లడైంది.
 
దాదాపు 6 వేల మందిపై చేసిన అధ్యయనంలో వారికున్న స్నేహితుల సంఖ్య, మానసిక ఆరోగ్యానికి మధ్య గల సంబంధంపై పరిశోధన చేశారు. స్నేహితులు ఎక్కువగా వున్న మధ్య వయస్కులు, ఇతరులతో పోల్చితే వారు మానసికంగా దృఢంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. 
 
ఇక తక్కువగా లేదంటే అసలు స్నేహ మాధుర్యాన్ని చవిచూడని వారు మానసికంగా బలహీనంగా ఉన్నట్లు తేలింది. ఈ ఫలితాలు పురుషులు, మహిళల్లో ఒకేలా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కనుక ఎక్కువమంది స్నేహితులున్నవారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేసేయండి మరి. 

వెబ్దునియా పై చదవండి