ఏదో తెలియని దిగులు వేదిస్తుందా..? ఇలా చేసి చూడండి...!

శనివారం, 22 నవంబరు 2014 (16:14 IST)
ఎంతటి వారికైనా ఏదో ఒక సమయంలో ఏదో తెలియని దిగులు, బాధ వేదిస్తుంది. తద్వారా నిద్రకు దూరమవుతారు. ఇందుకు నిగూఢంగా ఉండే అనేక అంశాలు కారణం కావచ్చు. సంతోషాన్ని తెచ్చుకుందామని పదే పదే తలపోస్తూ, ఇంకొంచెం అసంతృప్తికి ద్వారాలు తెరుస్తుంటారు. అసలు ఇలా ప్రయత్నించడమే దిగులుకు దారి తీస్తుంది. ఏ ప్రయత్నం లేకుండా సాధ్యమయ్యేదే సంతోషం.
 
నచ్చిన పనిని చేయాలి. ఇష్టమైన ఆహారం తినాలి. సంగీతం వినడం, ప్రకృతిని వీక్షించండం, నచ్చిన వారితో కాసేపు మాట్లాడటం, చిన్న చిన్న పాపాయిలతో ఆట్లాడుకోవడం, ఇండోర్ గేమ్స్ ఆడటం, గార్డెనింగ్ వంటి అనేకానేక పనుల నుంచి సంతోషాన్ని దక్కించుకోవచ్చు. 
 
అప్పటికీ దిగులు నుంచి బయటపడలేకపోతే లాఫింగ్ క్లబ్‌కు వెళ్లవచ్చు. అయినా మనో వేదన తగ్గకపోతే ఒక సారి వైద్యులను కూడా సంప్రదించవచ్చు. సంతోషంగా, మనసారా నవ్వుతూ కనిపించే వ్యక్తుల సమక్షాన్ని అందరూ కాంక్షిస్తారు. 

వెబ్దునియా పై చదవండి