స్త్రీ ప్రియురాలిగా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది?

మంగళవారం, 19 నవంబరు 2019 (21:59 IST)
స్త్రీ పురుషుల నడుమ శారీరక ఆకర్షణ ఏర్పడటం ప్రకృతి సహజం. రెండు వివిధమైన రూపాలుండటమే ఆ ఆకర్షణకు కారణమవుతుంది. శారీరకంగానో, నా జోడు నాకంటే పూర్తిగా భిన్ననదై ఉండాలి. అయితే, మానసికంగా నా నుంచి ఏమాత్రం వేరుగా తోచకూడదు" అన్న ఆలోచన హద్దులు లేని కోరిక. అందువల్లే ప్రేమ అని మీరనుకునేది, శ్వాస ఆడకుండా ఉత్తినే తరిగిపోతుంది. 
 
పెళ్లికి ముందు మీ జోడు కలుసుకోవడానికి వెళ్లేటప్పుడు అందమైన దుస్తులు ధరించి , తియ్యతియ్యగా మాట్లాడేవారు. హోటల్ లోనో, థియేటర్ లోనో గడిపిన కొన్ని గంటలు, తమతమ లోపాలను మర్చిపోయి, మిమ్మల్ని మీరు గొప్పగా చూపించుకొనుంటారు. 
 
అదొకరకం నిజం. కలిసి బతికేటప్పుడు పళ్లు తోముకునే తీరో, వండి వడ్డించే తీరో, నిద్దట్లో గురకపెట్టటడమో ఏదో ఒకటి మీకు నచ్చకపోయి ఉండవచ్చు. ఇది రెండోరకమైన నిజమని గుర్తించండి. లోకమంతా నశించిపోయినా తరిగిపోనిది ప్రేమ మాత్రమే అని చెప్పుకున్నవాళ్లు కూడా, కొంతకాలం తర్వాత ప్రేమ కోల్పోయి బతుకుతున్నారు.. 
 
ఇది ప్రేమ తప్పు కాదు. రెండు వివిధ నిజాల్ని స్వీకరించడానికి తయారుకాలేని తయారు కాలేని పరిస్థితి మీద. మీ గొడవ ఏంటో మీకు తెలుసా..? ప్రేమ అన్నది పెళ్లికి ముందు మొదటి మెట్టుగా భావించడం. అది తప్పుడు లెక్క. 
 
ఒక స్త్రీ ప్రియురాలిగా ఉన్నప్పుడు ఆమెను ఎలా చూసుకున్నామో, అలాగే భార్యగా ఉన్నప్పుడు కూడా అలాగే చూసుకోవాలని మర్చిపోతున్నారు. ఇప్పుడు మీ ప్రేమలో కలిసిపోలేకపోతున్నారు. బాధ్యతల్ని గుర్తిస్తున్నారు. ప్రేమ అగపడకుండానే పోతుంది మరి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు