నా భర్త సోదరి నా మాజీ బోయ్‌ఫ్రెండును పెళ్లాడింది... ఇప్పుడేం చేయాలి?

బుధవారం, 25 మే 2016 (18:48 IST)
పెళ్లయ్యాక నేను, నా భర్త రెండేళ్లుగా అమెరికాలో ఉన్నాం. ఇటీవల నా భర్త సోదరికి ఓ సంబంధం చూశారు. నిశ్చితార్థం చేసుకునేటపుడు నన్ను రమ్మన్నారు కానీ నేను వెళ్లలేకపోయాను. తీరా ముహూర్తం అంతా పెట్టేశాక చూస్తే... అతడు నా మాజీ బోయ్ ఫ్రెండ్ అని తెలుసుకుని షాక్ తిన్నాను. పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లి తర్వాత ఈమధ్య మేము తిరిగి స్వదేశానికి వచ్చేశాం.


ఇపుడు అతడు 15 రోజులకోసారి మా ఇంటికి వస్తున్నాడు. నా భర్తకు నా గత చరిత్ర తెలియదు. అలాగే అతడు నా మాజీ స్నేహితుడని ఎవరికీ తెలియదు. కానీ అతడు విషయం చెప్పేస్తాడేమోనని భయంగా ఉంది. ఐతే అతడేమీ ఎరగనట్లు మాట్లాడుతున్నాడు. నేను కూడా దాదాపు అలాగే ఉంటున్నాను. కానీ అతడిపై నాకు అనుమానంగా ఉంది. గతాన్ని తవ్వి గందరగోళం చేస్తాడేమోనని... ఏం చేయాలి...?
 
ఇది చాలా సున్నితమైన, జఠిలమైన సమస్య. అసలు మీ బోయ్ ఫ్రెండు- మీరు ఎందుకు విడిపోయారు...? అతడు మళ్లీ మీ భర్త సోదరనే అతడు ఎలా చేసుకున్నాడు...? అనే ప్రశ్నలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే అతడి ఉద్దేశ్యం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. అనుకోని పరిస్థితుల వల్ల పరస్పరం విడిపోవాల్సి వస్తే సమస్య తలెత్తకపోవచ్చు కానీ, అతడు కావాలనే మీ మరదలిని పెళ్లాడితే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండక తప్పదు. ఆందోళన చెందకుండా వారికి కాస్తంత దూరంగా ఉండేట్లు ఇల్లు చూసుకోండి.

వెబ్దునియా పై చదవండి