రోజూ శృంగారంలో పాల్గొంటే ఏం జరుగుతుందో తెలుసా?

మంగళవారం, 24 అక్టోబరు 2017 (22:00 IST)
శృంగారంలో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొంటే గుండె, మెదడు, రోగ నిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. అందుకే యవ్వనాన్ని వృధా చేసుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతాయట.
 
అంతేకాదు శృంగారంలో పాల్గొనే స్త్రీ, పురుషులలో రోగ నిరోధక వ్యవస్థ 23 శాతం మెరుగుపడుతుంది. శృంగారంలో పాల్గొనడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ క్రియలో పాల్గొనేటప్పుడు ఆక్సిటోజన్ అనే హార్మోన్ విడుదల కావడం వల్ల రోజంతా చురుగ్గా ఉండేందుకు దోహదం చేస్తాయి. ప్రతిరోజు హగ్ చేసుకోవడం, చిన్నచిన్న శారీరక స్పర్శల వల్ల ఆయుష్షు కూడా పెరుగుతుందంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు