ఇక్కడ ఓ విషయాన్ని మీరు గమనించాలి. ఏ వాసన ఎవరు ఇష్టపడతారనేది వ్యక్తివ్యక్తికీ మారుతూ ఉంటుంది. కొంతమందిలో పూల వాసనలు శృంగార కోర్కెలను పెంచుతాయి. ఈ పూలలో కూడా మల్లెలు కొంతమందికి ఇష్టమయితే మరికొందరిలో జాజులు, ఇంకొందరిలో సంపెంగల వాసనలు ఇష్టంగా ఉంటాయి. వాటి ద్వారా ఉద్దీపనలు వారిలో కలుగుతాయి. కనుక కొన్ని రకాల అత్తరులకు ఇలా కోర్కెలను రగిల్చే గుణం ఉంటుంది.