కవ్విస్తుంది... ఇంటికెళ్లగానే ఫోన్ స్విచాఫ్ చేస్తోంది...

శనివారం, 3 నవంబరు 2018 (22:40 IST)
మేమిద్దరం కాలేజీ డేస్ నుంచి ఒకరికొకరు తెలుసు. కానీ ఇద్దరం ఉద్యోగాలు చేరిన తర్వాతే మాట్లాడుకున్నాం. ఆమె మాట్లాడుతుంటే నాకు తెలియని హాయి కలుగుతుంది. జస్ట్ ఆమె అలా టచ్ చేస్తే చాలు.... శరీరం పులకించిపోతుంది. ఆమె నాతో ఉన్నంతసేపు మరో లోకంలో విహరిస్తున్నట్లు ఉంటుంది. ఈమెతో నేను కాలేజీ రోజుల్లోనే మాట్లాడి ఉంటే ఖచ్చితంగా ఆమెను పెళ్లాడేవాడిని. కానీ... ఇప్పుడు స్నేహం కుదిరింది.
 
నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. కానీ ఆమె ఆలోచనలతోనే ఎక్కువసేపు కాలం  గడుపుతున్నాను. ఐతే ఉదయం నుంచి సాయంత్రం ఇంటికెళ్లే దాకా నన్ను కవ్విస్తూ మాట్లాడే ఈమె... ఇంటికెళ్లగానే ఫోన్ స్విచాఫ్ చేసేస్తోంది. ఆమెకు అలా చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా... సర్లే అంటుంది కానీ ఇంటికెళ్లగానే ఆఫ్ చేసేస్తోంది. ఆమె మాటలు విననిదే ఉండలేకపోతున్నా. ఈమధ్య రాత్రికి ఇంటికి వచ్చేస్తానన్నాను. అంతే... అప్పట్నుంచి ఫోన్ తీసుకురావడం మానేసింది. ఫోన్ చెడిపోయిందని చెపుతోంది. ఆమె నన్ను అంతగా ఎందుకు ఉడికిస్తోంది...? వస్తానంటే ఎందుకిలా చేస్తోంది...? అర్థం కావడంలేదు...
 
ఆఫీసు వరకే మీతో స్నేహం. ఇక కవ్విస్తోంది అని అంటున్నారు. ఆమె ఎలా కవ్విస్తుందనేది చెప్పలేదు. మీ మాటలను బట్టి కేవలం ఆమె మీతో మాట్లాడటం వరకే చేస్తోంది. మీరే అతిగా ఊహించుకుంటున్నారు. పైగా పెళ్లయిన తర్వాత కూడా అలా  వస్తానని మీరు చెప్పినా ఆమె దాన్ని సహించి మీతో మాట్లాడుతోంది. ఆమె మరో రీతిలో ఆలోచిస్తే మీరు చిక్కుల్లో పడుతారు. జాగ్రత్త... ఆమె మీతో ఎలాంటి సంబంధాన్ని కోరుకోవడం లేదని గమనించండి. మీరు ఇంటికి వస్తానన్న తర్వాత ఫోన్ కూడా తీసుకురావడం లేదంటే మీ పట్ల ఆమెకు ఎలాంటి ఆలోచనలు లేవని అర్థం చేసుకోండి. జస్ట్ స్నేహితుడిగానే ఆమె చూస్తున్నారు. మీరు మరోలా ఊహించుకుని అన్నీ పాడుచేసుకోవద్దు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు