భార్యాభర్తలు థ్యాంక్సూ అనే పదం వాడుతున్నారా?

సోమవారం, 9 అక్టోబరు 2017 (14:49 IST)
బయటివాళ్లు ఎంత చిన్నసాయం చేసినా గబుక్కున చెప్పేస్తే థ్యాంక్యూ అనే పదాన్ని ఇంటి సభ్యుల మధ్య పెద్దగా వాడకపోవడం సరికాదు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ పదం వాడితే.. ఆ శక్తి పెద్ద సంతృప్తిని ఇస్తుందని మానసిన నిపుణులు అంటున్నారు. 
 
భార్యాభర్తలు ఒకరికొకరు సాయపడినప్పుడు థ్యాంక్యూ అంటూ పరస్పరం చెప్పుకునే కృతజ్ఞతలకు చాలా శక్తి వుందని.. ఆ చిన్నమాట ఇచ్చే సంతృప్తి అంతా ఇంతా కాదని మానసిక నిపుణులు అంటున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య బాంధవ్యం దృఢంగా అల్లుకుంటుంది. అలాగే దంపతుల మధ్య వాడే మనం అనే మాట ఎంతో ఆహ్లాదాన్ని, భద్రతా భావాన్నిస్తుంది. 
 
మనం, మనది అన్న మాటలు వారి నడుమ తరచూ దొర్లుతుండాలని, ఇలాంటి పదాలు వాడటం ద్వారా మరింత అనురాగం తొణికిసలాడుతుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. తద్వారా కోపం అనే ప్రతికూల భావాలు తగ్గుతాయి. 
 
మానసిక ఒత్తిడి స్థాయులు తక్కువగా ఉంటాయి. కానీ, నేను, నాది అనే మాటలు పదే పదే దొర్లితే మాత్రం వ్యతిరేకభావాలు ఎక్కువవుతాయి. కాబట్టి చిన్నవే కదా అని వదిలేయక, ఇలాంటి పదాలను అప్పుడప్పుడు వాడుతూ వుండాలి. అలా చేస్తే.. మంచి జంటగా మారిపోతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు