మూడ్ అంతా చికాకుగా మారితే ఏం చేయాలి?

మంగళవారం, 22 జులై 2014 (15:10 IST)
సాధారణంగా ఒక్కోసారి ఏ కారణంగా స్పష్టంగా తెలియకపోయినా మూడ్ అంతా చికాకుగా మారిపోతోంది. ఇలాంటి సమయంలో ఎలా ప్రవర్తించాలన్న అంశంపై మానసిక నిపుణులను సంప్రదిస్తే.. 
 
దైనందిన జీవితంలో మధుర క్షణాలు అనేకం ఉంటాయి. అంటుంటి సందర్భాల్ని హాయిగా కళ్లు మూసుకుని పడుకుని మననం చేసుకోవడం ఒక మార్గం. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన చక్కటి సంఘటనల్ని, మనస్సుకు నచ్చిన మాటల్ని పదేపదే గుర్తు చేసుకోండి. ఆయా సంఘటనల్లోకి అలా జారిపోయి.. ఆ మధురానుభూతిని మళ్లీమళ్లీ అనుభవించండి. 
 
ఇకపోతే.. పాటలు వినడం, నచ్చిన సినిమా క్యాసెట్‌ను పెట్టుకుని మరోమారు చూడటం, మంచి పుస్తకం చదవం చేయాలి. ఇలా.. మూడ్‌ను మార్చుకోవాలన్న సంకల్పం, పట్టుదల మనలో ఉండాలే గానీ చిరాకు నుంచి బయటపడేందుకు అనేక అవకాశాలు మన చుట్టూనే ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి