నిరాశావాదాన్ని వీడి... ఉత్సాహాన్ని ఏవిధంగా నింపుకోవాలి?

గురువారం, 26 మార్చి 2015 (16:51 IST)
ఎటువంటివారికైనా ఏదో ఒక సమయంలో నిరాశా నిస్పృహలు కమ్మేస్తుంటాయి. అయితే ఈ రకం ఆలోచనలు ఆనందాన్ని హరిస్తాయి. ఆందోళనకు తెరతీస్తాయి. ఆలోచనల్లో నిరాశాపూరితధోరణి తలెత్తుతుందని అనిపించగానే దాన్ని నియంత్రించుకునే దిశగా ప్రయత్నాలు సాగించాలి. 
 
ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టినట్లు విశ్లేషించవద్దు. జీవనగమనంలో మంచి, చెడులు రెండూ వుండాలి. వీలైనంతవరకు మంచినే పరిగణనలోకి తీసుకుని ఆ దిశగా ఆలోచనలను కొనసాగించాలి. 
 
కానీ నచ్చని విషయాల్ని పదే పదే స్ఫురణకు తెచ్చుకోకూడదు. మంచివైపునకు మనస్సును మళ్ళించే ప్రయత్నాలు చేస్తుండాలి. మంచిని పదే పదే స్మరించుకుంటూ, వాటి తాలూకు జ్ఞాపకాల్ని నింపుకోవడం ద్వారా నిరాశ పరిచే ఆలోచనలను దూరం చేసుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి