ఒక్కసారి వైఫల్యం ఎదురైతే చాలు.. దాన్ని తలచుకుని కుంగిపోతుంటారు కొందరు. కానీ విజయం సాధించాలంటే.. దాన్ని అధిగమించడమే సరైన పరిష్కారం అంటున్నారు.. సైకాలజిస్టులు. పొరపాటు జరిగినప్పుడు దాని నుంచి నేర్చుకోవాలి. అంతే తప్ప ఒక్కసారి విఫలమైతే పదేపదే వైఫల్యం వస్తుందని భయపడకూడదు. ఆ లోపాలను గుర్తించాలి. వాటిని పాఠాలుగా మార్చుకోవాలి.
శాస్త్రవేత్తలు ఏదైనా ప్రయోగం చేసి, అది ఫలించనప్పుడు మరో విధంగా ప్రయత్నిస్తారు. విజయం సాధించేంత వరకూ పట్టుదలతో అలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వైఫల్యం ఎదురైనప్పుడూ ఇదే సూత్రాన్ని పాటించాలి. కొత్త మార్గాన్ని అనుసరించాలి.