స్వార్థం పెరిగిపోకుండా చూసుకోండి..!

సోమవారం, 6 అక్టోబరు 2014 (18:11 IST)
ప్రతి ఒక్కరిలోనూ స్వార్థం అనేది ఉంటుంది. అయితే శ్రుతిమించిదే ప్రమాదం. స్వార్థంగా మారితే ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. అయిన వారినీ దూరం చేస్తుంది. ఆ తీరును తగ్గించుకోవాలంటే స్వార్థం పెరిగిపోకుండా చూసుకోవాలని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా స్నేహితురాలూ, సహోద్యోగి, జీవిత భాగస్వామి.. ఎవరైనా కావచ్చు. మీతోనే మాట్లాడాలి, మీకే సమయం కేటాయించాలి అనుకోవద్దు. ఇతరులతో మాట్లాడితే సహించలేకపోవడం వంటివి చేయొద్దు. ఇక్కడ మిమ్మల్ని నా అనుకునే స్వార్థం చుట్టుముట్టి ఉండొచ్చు. దీనివల్ల మీ స్థానాన్ని ఇతరులు భర్తీ చేస్తారనుకోవడం కేవలం అపోహే. 
 
మీరు ఇలాగే ప్రవర్తిస్తుంటే.. మీ చర్యలతోనే వారు మిమ్మల్ని దూరమవుతారని అర్థం చేసుకోండి. మీకు వారిపై ప్రేమ ఉన్నప్పటికీ.. వారి ఇష్టానికి తగ్గట్టు కొంత సమయాన్ని గడిపే స్వేచ్ఛనూ ఇవ్వండి. ఇది మీ అనుబంధాన్ని పెంచుతుంది. మీ స్వార్థాన్ని దూరం చేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి