నా గర్ల్ ఫ్రెండ్‌ను విడిచి 6 నెలలు దూరంగా... ఆమె సెక్స్‌లో పాల్గొంటుందేమో...

గురువారం, 15 మే 2014 (15:59 IST)
FILE
నేను ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడే ఓ అందమైన అమ్మాయి పరిచయమైంది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఆమె అడిగినా నాకు ఫారిన్ ట్రిప్ ఉండటంతో మరో ఏడాది తర్వాత చేసుకుందామన్నాను. ఐతే ఆమె, నేను రోజుకు రెండుసార్లు సెక్సులో పాల్గొంటాం. ఒకవేళ నేను విశ్రాంతి తీసుకుందామని చెప్పినా సెక్స్ లేకుండా ఆమె ఉండలేదు. నన్ను రెచ్చగొట్టి మరీ సెక్స్ చేయించుకుంటుంది. ఇపుడు నేను విదేశీ పర్యటనలో 6 నెలలు ఉండాల్సి వస్తుంది.

సెక్స్ అంటే అంత పిచ్చి ఉన్న నా గర్ల్ ఫ్రెండ్ మరెవరితోనైనా సెక్సులో పాల్గొంటుందేమోనన్న ఆందోళనగా ఉంది. అప్పటికీ సిగ్గు విడిచి తనతో ఇదే విషయం చెప్పేశాను. ఆమె తను ఎవ్వరితో మాట్లాడననీ, సెక్స్ కేవలం నాతో మాత్రమే చేయాలనిపిస్తుంది తప్ప ఇంకెవరితోనూ చేయనని చెప్పింది. అయినా ఆమె చాలా అందగత్తె. పైగా ఆఫీసులో ఇద్దరుముగ్గురుతో కాస్త చనువుగా ఉంటుంది. నేను ఉండనని తెలిసిన తర్వాత వారు నా గర్ల్ ఫ్రెండును లొంగదీసుకుంటారేమోనని భయంగా ఉంది. ఈ ఆందోళన నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేదు...

మీది అర్థంలేని భయం. మీరు 6 నెలలు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. మీలానే మీ గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడ మీరు ఎవరి ప్రేమలోనైనా పడుతారేమో అని భయపడుతుందా... అదేమీ లేదు కదా. జీవితంలో భాగస్వామిగా చేసుకోదలచిన వ్యక్తిపై నమ్మకం ఉండాలి. మరొక వ్యక్తితో సెక్సులో పాల్గొంటావేమోనన్న అనుమానాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే దానికి ఓపికగా ఆమె సమాధానం చెప్పినందుకు మీరు సంతోషించాలి.

మరొకరెవరైనా అయితే చీవాట్లు తప్పకుండా పడేవి. పెళ్లికి ముందు సెక్స్ అనర్థాలకు దారి తీస్తుంది. అంతేకాదు ఇలాంటి అపోహలకు కూడా తావిస్తుంది. అందుకే పెళ్లికి ముందు ప్రేమికులు శారీరక సుఖాన్ని చవిచూడటం కంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పని చేసుకుంటే సంతోషంగా ఉంటారు.

వెబ్దునియా పై చదవండి