సత్యసాయి జన్మదిన వేడుకలు ప్రారంభం

మంగళవారం, 18 నవంబరు 2008 (13:49 IST)
పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా, ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పుట్టపర్తిలోని స్థానిక వేణుగోపాల స్వామి రథోత్సవంతో పాటుగా ప్రారంభమైన బాబా 83వ జన్మదిన వేడుకలకు దేశం నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు.

సహస్ర చంద్ర దర్శన యజ్ఞం సందర్భంగా, ఇప్పటికే వేలాదిమంది భక్తులు పుట్టపర్తిలో బస చేసి ఉండగా, జన్మదిన వేడుకలకు దేశం నలుమూలల నుంచీ వస్తోన్న అశేష భక్తజన సందోహంతో పుట్టపర్తి నిండిపోనుంది. సహస్ర చంద్ర దర్శనానికి విచ్చేసిన భక్తులు బాబా జన్మదిన వేడుకలకు అక్కడే ఉండిపోవటంతో పుట్టపర్తి సందర్శకుల సంఖ్య మరింత పెరగనుంది.

దీంతో అశేష భక్తజనావళికి వసతి సౌకర్యాలను కల్పించటంతో పాటు, వారందరి భద్రతపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇదిలా ఉంటే... బాబా పుట్టినరోజు వేడుకలకు తరలివస్తోన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అటు అధికారులు, ఇటు బాబా యంత్రాంగ సిబ్బంది ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు. సత్యసాయి జన్మదిన వేడుకల్లో ఎలాంటి అపశృతి నెలకొనకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి